Rythu Runa Mafi: రైతుల రుణ మాఫీ పై ట్విస్ట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం!

Rythu Runa Mafi: తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం ఎక్కడ చూసిన రైతుల రుణ మాఫీ గురించే చర్చ జరుగుతుంది.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అర్హులైన రైతులందరి ఖాతాలో రుణ మాఫీ డబ్బులు జమ చేసింది.తాజాగా ఇదే క్రమంలో రేవంత్ ప్రభుత్వం రైతుల రుణ మాఫీ గురించి మరొక కీలకమైన నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన రైతులందరి ఖాతాలో రెండు దఫాల్లో రుణ మాఫీ జరిగింది.ఈ రుణ మాఫీ ద్వారా లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పచ్చు.

తెలంగాణ ప్రభుత్వం ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని జులై 18 న ప్రారంభించింది.రైతుల రుణ మాఫీ కార్యక్రమం విడతల వారీగా జరుగుతుంది.మొదటి విడతలలో లక్ష రూపాయల కంటే తక్కువ తీసుకున్న రైతులకు రుణ మాఫీని అమలు చేసారు తెలంగాణ ప్రభుత్వం.మొదటి విడతలో అర్హులైన 11 లక్షలు 50 వేల మంది రైతులకు రుణ మాఫీ అమలు చేసారు.ఈ క్రమంలో రూ.6098 కోట్ల రూపాయలు అర్హులైన రైతుల ఖాతాలో జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

ఇక రెండవ విడతలో అర్హులైన 6 లక్షల 90 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.6190 కోట్ల రూపాయలు రుణ మాఫీ అందించారు.ఈ రెండు విడతలు కలిపి మొత్తంగా 17 లక్షల 75 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.12 వేల 224 కోట్ల రూపాయలు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం.ఇదే క్రమంలో మూడవ విడత రుణ మాఫీ కి సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకుంది రేవంత్ ప్రభుత్వం.రూ.2 లక్షలు, 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వారిని రెండు విభాగాలుగా విభజించి రుణ మాఫీ చేయనున్నారు.

అంటే మూడవ విడత రెండు దఫాలలో జరగనుంది అని తెలుస్తుంది.2 లక్షలు ఋణం ఉన్న రైతులకు ఒక దఫాలో రెండు లక్షల కంటే ఎక్కువ ఋణం ఉన్న రైతులకు మరొక దఫాలో రుణ మాఫీ చేయనున్నారు తెలంగాణ ప్రభుత్వం.దీనికి సంబంధించిన అధికారులు బ్యాంకుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు.ఆగష్టు 15 వ తేదీ లోగ మూడవ విడత 2 లక్షల ఋణం ఉన్న రైతులకు రుణ మాఫీ చేయనున్నారు అని తెలుస్తుంది.

Leave a Comment