Train Tickets: ప్రయాణికుల కోసం మంచి శుభవార్తను అందించిన రైల్వే..ఇకపై టికెట్ ను ఇలా సులువుగా కొనుగోలు చేయచ్చు!

Train Tickets: మన దేశంలో ఉన్న రవాణా మార్గాల్లో రైలు మార్గం కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నిత్యం లక్షల మంది ప్రయాణికులు రైలు మార్గం ద్వారా దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు.కుటుంబం తో లేదా స్నేహితులతో కలిసి వెకేషన్లకు లేదా పుణ్య క్షేత్రాలకు వెళ్లేందుకు ప్రయాణికులు మొదటి ప్రాధాన్యత రైలు మార్గానికే ఇస్తారు.ఇక పండగలు,వేసవి సెలవులు వచ్చినప్పుడు రైళ్లకు ఉన్న రద్దీ గురించి అందరికి తెలిసిందే.

ఎక్కువగా ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి రైలు మార్గాన్నే అనుసరిస్తారు.దూర ప్రాంతాలకు ప్రయాణించే వారు ముందుగా బుకింగ్స్ చేసుకుంటారు.మరికొంత మంది నేరుగా టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ లను కొనుగోలు చేస్తారు.అయితే లక్షల మంది ప్రయాణించే రైల్లో టికెట్ కౌంటర్ దగ్గర కూడా చాల ఇబ్బందులు పడతారు ప్రయాణికులు.టికెట్ కౌంటర్ దగ్గర క్యూ లైన్ అలాగే టికెట్ కొనుగోలు చేయడానికి  చిల్లర కోసం నానా తిప్పలు పడుతుంటారు.

ఈ క్రమంలోనే అలంటి వారి కోసం రైల్వే శాఖ ఒక మంచి శుభవార్తను అందిస్తుంది.ఇక పై రైలు టికెట్ కొనడానికి చిల్లర అవసరం లేకుండా డిజిటల్ చెల్లింపు విధానాన్ని కలిగిస్తుంది.QR కోడ్ ను ఉపయోగించి టికెట్ కొనుగోలు చేసే విధంగా అడుగులు వేస్తుంది రైల్వే శాఖ.ఇప్పటికే ఈ విధానం చాల చోట్ల అమలులో ఉంది.ఈ విధానం టికెట్ కౌంటర్ దగ్గర రద్దీని తగ్గించడంలో అలాగే చిల్లర కష్టాలను తొలగించడంలో బాగా సహాయపడుతుంది.

Leave a Comment