AP Pensioners: పెన్షన్ల పంపిణి పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..కొత్త గైడ్ లైన్స్ విడుదల!

AP Pensioners: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.సూపర్ సిక్స్ లో చెప్పిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం.ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్తున్నారు.ఈ క్రమంలో భాగంగానే పెన్షలను రూ.4 వేలకు పెంచుతామని చెప్పిన సంగతి తెలిసిందే.ఇక అన్నట్లుగానే పెన్షన్ ను పెంచడం జరిగింది.పెంచిన పెన్షన్ తో పాటు పెండింగ్ నెలకు సంబంధించి డబ్బును కూడా పంపిణి చేసింది ఏపీ ప్రభుత్వం.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూ.7 వేలు చొప్పున జూన్ నెలలో పెన్షన్(Pension) పంపిణి చేసారు.వాలంటీర్ల సహాయం లేకుండానే ప్రజలకు పెన్షన్ అందజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.ఆగష్టు 1 ప్రజలకు పెన్షన్ అందించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయ్యింది.గ్రామీణ పేదరిక నిర్ములన సొసైటీ ఆగష్టు 1 వ తేదీన ఉదయం నుంచే ఒక్క రోజులోనే పెన్షన్ పంపిణి పూర్తి చేయాలనీ గైడ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది.

లబ్ధిదారులు అందరికి ఎల్లుండి ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ అందించేందుకు రెడీ అయ్యింది ఏపీ ప్రభుత్వం.రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రమంలోనే గ్రామ పంచాయితీ సిబ్బందికి కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.కూటమి నేతలు ఏపీ లో అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు కొన్ని కీలకమైన హామీలను ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆ హామీలలో పెన్షన్ పెంచడం కూడా ఒకటి.ఇక చెప్పినట్లు గానే పెన్షన్ పెంచి ప్రజలకు అందిస్తున్నారు ఏపీ ప్రభుత్వం.

ఇక ఏపీ లో త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కూడా కలిపించనున్నారు ఏపీ అధికారులు.సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరి నియోజకవర్గం మంత్రి నారా లోకేష్ తో కలిసి గత నెలలో పెన్షన్ పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు.సీఎం చంద్రబాబు నాయుడు ఆగష్టు 1 వ తేదీన మడకశిర నియోజకవర్గం లో జరిగే పెన్షన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొంటారు.

Leave a Comment